టాలీవుడ్ కు నా చిత్రంతో హ్యాట్రిక్ : అల్లు అర్జున్

SMTV Desk 2018-04-30 12:26:57  na peru surya, allu arjun, prirelease event, tollywood hatric.

హైదరాబాద్, ఏప్రిల్ 30 : "రంగస్థలం", "భరత్ అనే నేను" వెంట వెంటనే రిలీజ్ అయి రికార్డుల పరంగా ఒకదానికొకటి దూసుకుపోతున్నాయి. ఒకటేమో పక్కా పల్లెటూరి కథాంశం, మరొకటి పూర్తిగా రాజకీయ నేపథ్యం.. అయినా రెండు ఒక రికార్డును మరో రికార్డు బద్దలు కొడుతూ దూసుకుపోతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన "నా పేరు సూర్య" చిత్రం మే 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. టాలీవుడ్ కు నా చిత్రంతో హ్యాట్రిక్ విజయం దక్కాలని కోరుకు౦టున్నట్లు తెలిపారు. ఒక నిజాయితితో ఒక చిత్రం తీయాలన్న తన కోరిక ఇప్పటికి తీరిందని.. దర్శకుడు వంశీ ని ఎంతగానో నమ్మి ఈ చిత్రం చేశానని.. ఈ చిత్రం అందరిని గర్వపడేలా చేస్తుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దర్శకధీరుడు దాసరి నారాయణరావు పుట్టిన రోజున ఈ చిత్రం విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఆర్మీ అధికారి పాత్రలో నటించారు.