సూపర్ స్టార్ వల్ల ‘థార్‌’ కు గౌరవం : ఆనంద్ మహీంద్రా

SMTV Desk 2018-04-30 11:43:28  KALA MOVIE, RAJANIKANTH, MAHINDRA THAR VEHICLE, ANADH MAHINDRA.

చెన్నై, ఏప్రిల్ 30 : సూపర్ స్టార్ రజనీకాంత్ పా రంజిత్‌ దర్శకత్వంలో "కాలా" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ చిత్రం కోసం రజనీ మహీంద్ర థార్‌ వాహనాన్ని ఉపయోగించారు. ఈ విషయం గురించి మహీంద్ర గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్ర ప్రస్తావిస్తూ.. ఈ వాహనాన్ని తమ ఆటో మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతామని తెలుపుతూ వార్త పత్రికలో వచ్చిన కాలా పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. అంతేకాకుండా "నేను ఈరోజు వార్తాపత్రిక మొదటి పేజీలో చూసిన తొలి దృశ్యం ఇది.. ఇంతకు మించిన కామెంట్‌ అవసరం లేదనుకుంటా. థార్‌ను వాహనంగా ఎంచుకోవడంతో దానికి గౌరవం దక్కింది" అంటూ కామెంట్ కూడా పెట్టాడు. మొత్తానికి రజనీకాంత్ కాలా చిత్రం కోసం థార్‌ వాహనాన్ని ఉపయోగించడం వల్ల థార్‌ కు గౌరవం దక్కిందన్నమాట. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ పంపిణీ చేస్తున్న ఈ చిత్రాన్ని మే 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.