సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పించు..‘ఈ నగరానికి ఏమైంది?’

SMTV Desk 2018-04-26 11:16:00  ee nagaraniki emaindi movie, suresh babu production, tollywood, tarun bhaskar

హైదరాబాద్‌, ఏప్రిల్ 26 : ఈ నగరానికి ఏమైంది.. సినిమాలు చూసే వారికి బాగా పరిచయమైనా పేరు. ఇప్పుడు ఇదే పేరుతో సినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించబోతోంది. ఈ సినిమాకు ‘ఈ నగరానికి ఏమైంది’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. పోస్టర్‌లో టైటిల్‌ కింద ‘నీ గ్యాంగ్‌తో థియేటర్‌కి రా చూసుకుందాం’ అన్న క్యాప్షన్‌ ఆకట్టుకుంటుంది. పోస్టర్‌లో నలుగురు వ్యక్తులు కోపంతో నడుచుకుంటూ వెళుతున్నట్లు చూపించారు. వీరిలో ఒకరి చేతిలో మాప్‌, రెండో వ్యక్తి చేతిలో కెమెరా స్టాండ్‌, మరో వ్యక్తి క్లాప్‌ బోర్డ్‌ పట్టుకున్నట్లు చూపించారు. తరుణ్‌ భాస్కర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. సమాజంపై సినిమా ప్రభావం ఎలా ఉంది? అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.