కల్వర్టును పేల్చేసిన మావోలు

SMTV Desk 2018-04-25 19:08:06  maiosts blast Bhadradri Kothagudem taliperu project

భద్రాద్రి, ఏప్రిల్ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు సమీపంలోని రోటింత వాగుపై నిర్మించిన లెవల్‌ చప్టా (కల్వర్టు)ను మావోయిస్టులు పేల్చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు విధించిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం నిరసన దినంగా ప్రకటించాలని మావోయిస్టులు మంగళవారం లేఖను విడుదల చేశారు. ఈ క్రమంలోనే కల్వర్టును ధ్వంసం చేశారు. భారీ మందు పాతర వినియోగించడంతో కల్వర్టు పూర్తిగా ధ్వంసమైంది.