నా పూర్తి సపోర్ట్ పవన్ కే : మనోజ్

SMTV Desk 2018-04-24 17:17:23  manchu manoj, about casting couch, manoj twitter, pawan kalyan,

హైదరాబాద్, ఏప్రిల్ 24 : తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల పరిష్కారానికి పరిశ్రమ పెద్దలు ఆలోచనలో పడ్డారు. ఈ సమస్యలపై ఇప్పటికే పలువురు సినీ తారలు స్పందించారు. తాజాగా ఈ విషయంపై మంచు మనోజ్ స్పందించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ఒక లేఖను విడుదల చేశాడు. "నిజానికి లైంగిక వేధింపులు అనేవి అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఉన్నాయి. కార్పొరేట్‌, రాజ‌కీయాలు, మీడియా, బ్యాంకింగ్ మొద‌లైన అన్ని రంగాల్లోనూ మ‌హిళ‌లు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఒక్క సినీ రంగంలోనే ఈ పరిస్థితి ఉన్నట్లు బురద చల్లడం సరికాదు. ఈ సమస్యపై ప్రతి ఒక్కరు పోరాడాలి. పవన్ కళ్యాణ్ అన్న మహిళా సమస్యలపై పోరాడతానని ట్వీట్ చేశారు. ఈ విషయంలో నా పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్ అన్నకు ఎప్పుడు ఉంటుంది. ఈ సమస్య త్వరలోనే తీరిపోతోంది. మీడియా ఈ విషయంలో కాస్తంత పద్దతిగా వ్యవహరించి ఉంటే బాగుండేది" అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.