దీపికా వేసుకున్న జాకెట్ ఖరీదెంతో తెలుసా..!!

SMTV Desk 2018-04-24 15:58:37  DIPIKA PADUKONE, DIPIA JOCKET PRICE, DIPIKA IN MUMBAI AIRPORT.

ముంబై, ఏప్రిల్ 24 : సినిమా ఫంక్షన్లకు తారలు ఖరీదైన దుస్తులు వేసుకురావడం సాధారణమే. అయితే ఇక్కడ దీపికా పదుకొనే విమానాశ్రయం నుండి వస్తున్న ఫోటోలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దీపికా గ్రీన్ కలర్ టీషర్టు వేసుకొని.. దానిపై ఓ ప్రింటెడ్‌ జాకెట్‌.. వదులుగా ఉన్న జీన్స్ వేసుకొని కనిపించింది. అయితే ఆమె వేసుకున్న జాకెట్ ఖరీదెంతో తెలుసా.! అక్షరాల రూ.91,498 అని సమాచారం. పైగా అది మెన్స్ కలెక్షన్ కావడం గమనార్హం. కేవలం సినిమా ప్రమోషన్లలో భాగంగా మాత్రమే కాకుండా ఇలా సాధారణ సందర్భాల్లోనూ దీపికా ఇలా తన ఫ్యాషన్ ను ఫాలో కావడంతో.. ఆమెకు ఫ్యాషన్ పట్ల ఎంత ఇష్టం ఉందో అర్థమవుతోంది. కాగా ప్రస్తుతం దీపికా.. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ తన హవా కొనసాగిస్తోంది. ఇటీవల ఆమె నటించిన "పద్మావత్" సినిమా ఘన విజయం సాధించిన విషయ౦ తెలిసిందే.