కాస్టింగ్ కౌచ్ పై సరోజ్‌ ఖాన్‌ ఘాటు వ్యాఖ్యలు..

SMTV Desk 2018-04-24 13:16:47  tollywood choreography, saroj khan, casting couch.

హైదరాబాద్, ఏప్రిల్ 24 : టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ తీవ్రమైన దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవల శ్రీరెడ్డి వివాదంపై ముంబైలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. "లైంగిక వేధింపులు అనేవి ఒక్క సినీ ప‌రిశ్ర‌మ‌కే ప‌రిమితం కావు. ప్రతి రంగంలో ఇలాంటివి చూస్తూనే ఉంటాం. సినిమా రంగ౦పై బురద చల్లే ప్రయత్నం చేయొద్దు. అది మాకు తండ్రితో సమానం. సినిమా రంగంలో ఆడ‌వాళ్ల‌ని ఊప‌యోగించుకున్న‌వాళ్లు.. వారిని ఊరికే వ‌దిలేయ‌రు. అలాగైనా కొంత‌మందికి తిండి దొరుకుతోంది క‌దా. అమ్మాయిలో ప్రతిభ ఉంటే తనని తాను అమ్ముకోవాలనుకోదు కదా? అయినా కాస్టింగ్ కౌచ్‌కు సిద్ధ‌ప‌డాలా? వ‌ద్దా? అనేది అమ్మాయిలు తీసుకోవాల్సిన నిర్ణ‌యం. మ‌న దగ్గ‌ర టాలెంట్ ఉంటే ఒక‌రి చేతుల్లో బందీ కావాల్సిన అవ‌స‌రం ఏముంది? వేరొక‌రికి అమ్ముడుపోవ‌డం ఎందుకు?" అంటూ ఘాటుగా స్పందించారు.