కార్ల తయారీలో తిరుగులేని మారుతి

SMTV Desk 2017-06-20 18:17:37  maruthi, vitera, c.u.m, alto, wegan,hyundaya,

న్యూఢిల్లీ, జూన్ 20: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో తన సత్తాను మరోసారి చాటుకున్నది. గడిచిన నెలలో దేశవ్యాప్తంగా అమ్ముడైన టాప్ 10లో మారుతికి చెందిన ఏడింటికి చోటు లభించింది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సి.యా.మ్) విడుదల చేసిన నివేదిక ప్రకారం మారుతికి చెందిన ఆల్టో తన మొదటిస్థానాన్ని నిలుపుకుంది. మే నెలలో 23,618 యూనిట్లు అమ్ముడైనా ఆల్టో ఈ రికార్డును సొంతం చేసుకుంది. గత ఏడాది ఇదే నెలలో 19,874 యూనిట్ల అమ్మకాలు జరిగాయని కంపెనీకి చెందిన మరో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్..16,532 యూనిట్లు అమ్ముడై రెండో స్థానం దక్కించుకుంది. అలాగే 15,741 యూనిట్లతో వ్యాగన్ ఆర్‌కు ఆ తర్వాతి స్థానం దక్కగా, బాలెనోకు నాలుగోస్థానం వరించింది మే నెలలో 14,629 యూనిట్లు అమ్ముడయ్యాయి. హ్యుందాయ్ మోటార్స్‌కు చెందిన క్యాంపాక్ట్ కారు గ్రాండ్ ఐ10కి ఐదోస్థానం(12,984 యూనిట్లు), గతేడాది పదోస్థానంలో ఉన్న మారుతికి చెందిన క్యాంపాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజ్జా ఈసారి 12,375 యూనిట్లతో ఆరోస్థానానికి ఎగబాకింది. హ్యుందాయ్‌కి చెందిన ఎలైట్ ఐ20కి ఏడో స్థానం దక్కింది. మారుతి క్యాంపాక్ట్ సెడాన్ డిజైర్ మిదోస్థానంలో నిలిచింది. హ్యుందాయికి చెందిన క్యాంపాక్ట్ ఎస్‌యూవీ క్రెటా 8,377 యూనిట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నది. టాప్-10 చివరి స్థానంలో మారుతికి చెందిన మల్టీ యుటిలిటీ వాహనమైన ఎర్టిగా నిలిచింది. మారుతికి చెందిన డిజైర్ టూర్, సెలేరియో, టయోటాకు చెందిన ఇన్నోవాలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.