షియోమీ రెడ్‌మీ 6 సిరీస్ ఫోన్లు విడుదల

SMTV Desk 2018-09-05 15:09:12  Redmi, redmi 6, redmi 6 pro

చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీదారు షియోమీ సంస్థ నుండి మూడు స్మార్ట్ ఫోన్ లు భారత మార్కెట్లో తాజాగా విడుదల అయ్యాయి. గతంలో చైనాలో విడుదల చేసిన సిరీస్ ప్రకారంగానే భారత్ లో కూడా రెడ్ మీ 6, 6 ప్రో, 6ఏ పేరిట నూతన స్మార్ట్ ఫోన్ లని తాజాగా విడుదల చేసింది. రెడ్‌మీ 6 ఈనెల 10న, రెడ్‌మీ 6ప్రో ఈనెల 11న, రెడ్‌మీ 6ఎ ఈనెల 19న విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. వీటి ధరలు, ప్రత్యేకతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. రెడ్‌మీ 6ఎ ధరలు: 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్: రూ.5999 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్: రూ.6999 రెడ్‌మీ 6 ధరలు: 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్: రూ.7999 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్: రూ.9499 రెడ్‌మీ 6 ప్రో ధరలు: 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్: రూ.10999 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్: రూ.12999 షియోమీ రెడ్‌మీ 6ఎ ఫీచర్లు: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హీలియో ఏ 22 ప్రాసెసర్ 5.45" హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ (256 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు) 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ షియోమీ రెడ్‌మీ 6 ఫీచర్లు: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హీలియో పీ 22 ప్రాసెసర్ 5.45" హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 12/5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 3 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ (256 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు) ఫింగర్‌ప్రింట్ సెన్సార్,ఫేస్ అన్ లాక్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ. షియోమీ రెడ్‌మీ 6 ప్రో ఫీచర్లు: 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 5.84" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ ( 256 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు) 12/5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ