ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్

SMTV Desk 2018-08-25 13:54:49  Flipkart, flipkart bumper offer

ఆన్ లైన్ షాపింగ్ చేసేవారికి శుభవార్త.వినియోగదారులకు మరొక బంపర్‌ ఆఫర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్‌ ఈ ఒక్కరోజుకు మాత్రమే పరిమితం. అదే ఫ్లిప్‌కార్ట్‌ సూపర్‌ సేల్‌ ఆఫర్‌. ఈ ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ ఒక్కరోజు కొనుగోలుచేసే వస్తువులపై భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది. సూపర్‌ సేల్‌ పేరుతో శనివారం ఒక్కరోజూ పలు వస్తువులపై 10 నుంచి 80 శాతం రాయితీ ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ఉన్న వారికి 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కూడా ఇస్తోంది.అంతే కాకుండా నెలసరి వాయిదాలు పద్ధతి ద్వారా చెల్లింపులకు కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో పొందవచ్చు. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్‌లు వంటి వస్తువులపై 70శాతం వరకు డిస్కౌంట్‌ ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్‌ టీవీలు తక్కువ ధరకే లభించే డీల్స్‌ ఉన్నాయి. ఫ్లాష్‌ సేల్‌ పేరుతో గంటగంటకూ ఆఫర్లు ప్రకటిస్తోంది