509 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

SMTV Desk 2018-09-11 16:34:07  Sensex, 509 points decreased

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ నష్టాలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 509 పాయింట్లు కోల్పోయి 37,413 వ‌ద్ద స్థిర‌ప‌డ‌గా, నిఫ్టీ 151 పాయింట్లు క్షీణించి 11,287 వ‌ద్ద ముగిసింది. రంగాల వారీగా చూస్తే పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగం సానుకూలంగా సాగ‌గా, ఎఫ్ఎంసీజీ రంగం క్షీణించింది. మార్చి 16 తర్వాత ఒక్క రోజులో ఈ స్థాయిలో సెన్సెక్స్ పతనమవడం ఇదే తొలిసారి. కొటక్ బ్యాంక్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, టాటా మోటార్స్, టాటా స్టీల్ 2 నుంచి 3.5 శాతం వరకు నష్టపోయాయి.