జియోఫోన్‌ 2 నాలుగో ఫ్లాష్‌ సేల్‌

SMTV Desk 2018-09-07 16:09:13  JIO Phone 2 fourth sale, reliance JIO,

జియోఫోన్‌ 2 ను సెప్టెంబరు 12న మధ్యాహ్నం 12గంటల నుండి జియో. కామ్‌లో ఫ్టాష్‌ సేల్‌ చేపట్టనున్నారు. ఈ ఫోన్‌ విడుదలైనప్పటినుండి ఇది నాలుగో ఫ్టాష్‌ సేల్‌ కావడం విశేషం. నాలుగో ఫ్లాష్ సేల్‌ను సెప్టెంబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు సంస్థ తన అధికారిక వెబ్‌సైట్ Jio.comలో పేర్కొంది. మూడో సేల్‌ను ఈనెల 6న నిర్వహించిన విషయం తెలిసిందే. 4జీ ఫీచర్ ఫోన్ ఫిజికల్ కీబోర్డు, డ్యుయల్ సిమ్ వంటి సదుపాయాలను జియో ఫోన్ 2లో అందిస్తున్నారు. దీని ధర రూ.2,999 గా ఉంది. ఈ ఫోన్‌ను కొన్నవారు జియోలో ఉన్న రూ.49, రూ.99 లేదా రూ.153 ప్లాన్లలో ఏదైనా ఒక ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.