మూడు బ్యాంకులు విలీనం

SMTV Desk 2018-09-18 10:51:08  Three Banks, State Banks,

ఇది వరకు స్టేట్ బ్యాంక్ అనుబంద శాఖలను అన్నిటినీ విలీనం చేసిన కేంద్రప్రభుత్వం, త్వరలో విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్ లను విలీనం చేయబోతోంది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో కేంద్ర ఆర్ధికసేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ సోమవారం సాయంత్రం డిల్లీలో మీడియాకు ఈవిషయం తెలియజేశారు. విలీనం వలన బ్యాంకు ఉద్యోగులకు, ఖాతాదారులకు గానీ ఎటువంటి అసౌకర్యమూ, నష్టమూ కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నామని తెలిపారు.