వాట్సాప్‌ వినియోగదారులకు షాక్...

SMTV Desk 2017-12-25 18:13:54  whatsapp, black berry operating system,

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: సోషల్ మీడియాలో దిగ్గజమైన వాట్సాప్‌కు కొందరు స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు వీడ్కోలు పలుకకా తప్పదు. ఇక 2017లో డిసెంబరు 31 తర్వాత బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, బ్లాక్‌బెర్రీ 10, విండోస్‌ 8.0 అంతకన్నా తక్కువ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఫోన్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయని సంస్థ తెలిపింది. జూన్‌తోనే సేవలు నిలిచిపోవాల్సి ఉండగా, వాట్సాప్‌ దాన్ని డిసెంబరు 31,2017 వరకూ పొడిగించింది. మరోవైపు నోకియా ఎస్‌40 ఫ్లాట్‌ఫాంపై నడిచే మొబైల్‌ ఫోన్లకు 2018 డిసెంబరు 31 వరకూ వాట్సాప్‌ సేవలు లభిస్తాయి. ఇక ఆండ్రాయిడ్‌ 2.3.7 అంతకన్నా పాత (జింజర్‌బ్రెడ్‌) ఓఎస్‌లతో నడిచే ఫోన్లలో వినియోగదారులు 2020 ఫిబ్రవరి 1 వరకూ వాట్సాప్‌ను వినియోగించుకోవచ్చు.