బ్రిటన్ లో ఉన్న మాల్య ఆస్తులన్ని సీజ్...

SMTV Desk 2017-12-10 17:20:22  Kingfisher chief Vijay Mallya, Mallya assets seized.

ముంబై, డిసెంబర్ 10 : వేల కోట్ల రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా కేసు విషయంలో వెస్ట్ మినిస్టర్స్ కోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన బ్యాంకు ఖాతాల లావాదేవీలనూ నిలిపివేసింది. బ్రిటన్ లో ఉన్న ఆయన ఆస్తులన్నింటిని స్తంభింపజేసిన కోర్టు, మాల్యాకు తన ఖర్చుల నిమిత్తం వారానికి కేవలం రూ. 4 లక్షలు మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా న్యాయస్థానం నుండి ఎలాంటి ఆదేశాలు జారీ కాకుండా ఆయన ఈ దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది.