భారత్ మూడు రెట్లు వెనుకంజ

SMTV Desk 2017-06-09 18:00:27  4g, lte, internet speed, low speed

న్యూఢిల్లీ, జూన్ 09 : ఇంటర్నెట్ 4జీ నెట్ వినియోగం భారత్ లో పెరిగినప్పటికి....స్పీడ్ లో ప్రపంచ దేశాల కంటే మూడు రెట్లు వెనుకంజలో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ద స్టేట్ ఆఫ్ ఎల్ టీ ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే 4జీ స్పీడ్ 5.1 ఎం బీ పీ ఎస్ వేగం మాత్రమే భారత్ లో లభిస్తుండగా..ఇతర దేశాల్లో 3 జీ స్పీడ్ 4.4 ఎంబీపీఎస్ గా ఉన్నట్లు నివేదిక వివరించింది. ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ 74 వ స్థానంలో ఉంది. పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంకల కన్నా భారత్ వెనుకంజలో ఉంది. 4 జీ స్పీడ్ లో సింగపూర్ మెుదటి స్థానంలో ఉండగా, అత్యధికంగా 4జీ సదుపాయం ఉన్న దేశంగా దక్షిణ కొరియా నిలి చింది. ప్రపంచవ్యాప్తంగా సగటు 4 జీ డౌన్ లోడ్ స్పీడ్ 16.2 ఎంబీ పీఎస్ గా నివేదిక వెల్లడిస్తోంది. 2016 చివరి నాటికి భారత్ లో మెుత్తం 217 మిలియన్ల మంది మెుబైల్ డేటా వినియోగదారులు ఉండగా గతేడాది సెప్టెంబర్ లో సగటు డేటా వినియోగం 236 ఎంబీ నుండి డిసెంబర్ నాటికి 884 ఎంబీకి పెరిగిందని ట్రాయ్ వివరాలు వెల్లడించాయి.