పన్నుఎగవేత లపై ఓఈసీడి ఒప్పందం

SMTV Desk 2017-06-09 14:42:51  tax, oecd, jaitley, oecd agreement

న్యూఢిల్లీ, జూన్ 09 : చట్టాల్లో లొసుగులు ఉపయోగించుకుని పన్నులు ఎగవేసే సంస్థలను గుర్తించి చర్యలు తీసుకునేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రపంచ ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థలో భాగస్వామ్యం కావడంతో పాటు అందులోని సభ్యదేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఓఈసీడిలో మెుత్తం 67 దేశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన బహుళపక్ష ఒప్పందం పై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంతకం చేశారు. తద్వారా వివిధ దేశాలు కుదుర్చున్న 1,100 పైగా ఒప్పంద నిబంధనల్లో తగుమార్పులు, చేర్పులు జరగనున్నాయి. ద్వంద పన్నుల నివారణ కోసం భారత్ కు ప్రస్తుతం సైప్రస్, మారిషస్, సింగపూర్ తదితర దేశాలతో ఒప్పందాలు ఉన్నాయి. వీటిని ఊతంగా తీసుకుని పలు బహుళజాతి సంస్థలు పన్ను ప్రయోజనాలు అత్యధికంగా ఉండే దేశాలకు ప్రధాన కార్యాలయాలను మళ్ళించి, ఇతర దేశాల్లో ఆర్జించే లాభాలపై పన్నులను ఎగవేస్తున్నాయి. ఇది గుర్తించిన భారత్ ఇటీవలే కొన్ని దేశాలతో డీటీఏఏ ఒప్పందాలను సవరించింది. ప్రధాన కార్యాలయమున్న దేశంలో కాకుండా కార్పొరేట్లు ఆదాయం ఆర్జించే దేశాల్లోనే పన్నులు కట్టే విధంగా మార్పులు చేసింది.