ఇన్ఫోసిస్ ఢమాల్... షేర్ మార్కెట్ లో పతనం

SMTV Desk 2017-06-09 14:33:57  infosys, share market collapse, narana murthy, vishale sikka

ముంబాయి, జూన్ 09 : షేర్ మార్కెట్ లో ఇన్ఫోసిస్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. కంపేనీ యాజమాన్య బోర్డులో ఉన్న లుకలుకలే ఇందుకు కారణమన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నా యి. కంపెనీ సహ వ్యవస్థాపకులు తమ వాటాలను విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్ కు ప్రతికూలప్రభావం ఏర్పడింది. సంస్థలో 28 వేల కోట్ల విలువ చేసే 12.75 శాతం వాటాను సహ వ్యవస్థాపకులు విక్రయిస్తున్నట్లు ఓ వార్తా సంస్థ కథనం వెలువరించడంతో దుష్పరిణామాలు ఎదుర్కోవల్సి వచ్చింది. ఇన్ఫో సిస్ షేర్లు దాదాపు 3.5 శాతం మేర క్షీణించాయి. అయితే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి ఖండించారు. మరోవైపు సహవ్యవస్థాపకులు తమ వాటాను విక్రయిస్తున్నట్లు వస్తున్న ఉహాగానాలను కంపెనీ తోసిపుచ్చింది.అటు వంటి పరిణామాలు ఏమి లేవని స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా ఇన్ఫోసిస్ బోర్డు పాలనలో సమస్యలు వచ్చిన సందర్భంగా ఇలాంటి ఉహాగానాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు భావిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కు వేతనాల పెంపు విషయంలో నారాయణ మూర్తి సహా ఇతర కంపెనీ ప్రతినిధులు వ్యతిరేఖించిన నేపథ్యంలో ఉహాగానాలకు ఆస్కారం ఏర్పడుతున్నది. ఈ విషయమై ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా స్పందిస్తు కంపెనీ సహ వ్యవస్థాపకులు తీసుకునే నిర్ణయంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, తాను అందుకు కట్టుబడి ఉంటానని వివ రించారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ముఖ్యంగా నారాయణ మూర్తి విలక్షణంగా, హుందాగా నడుచుకొంటారు..కేవలం భారతీయులకే కాదు, చాలా మందికి ఆయన ఆదర్శం..ఆయనే నన్ను నియమించారు. ఆయన వల్లే నేను ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నా..వారు తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉన్నా అని ఆయన పేర్కొన్నారు.