న్యూయార్క్, అక్టోబర్ 28 : ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా మొదటి స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టి బెజోస్ తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. శుక్రవారం స్టాక్ మార్కెట్లో అమెజాన్ షేర్లు 11.9 శాతం పెరగడంతో ఈయన సంపద విలువ కూడా పెరిగింది. అమెజాన్ కంపెనీ జూలై 5, 1994న జెఫ్ బెజోస్ వాషింగ్టన్ లో సియాటెల్ ప్రాంతంలో స్థాపించారు. ప్రస్తుతం బెజోస్ సంపద 90.6 బిలియన్ కాగా, బిల్‌గేట్స్ సంపద 90.1 బిలియన్ డాలర్లుగా ఉందని ఫోర్భ్స్ మ్యాగజైన్ ప్రకటించింది.