హైదరాబాద్, అక్టోబర్ 20 : ప్రస్తుత కాలంలో ఏది మరిచిన స్మార్ట్ ఫోన్ మాత్రం మరవడం సాధ్యం కానీ పని. మనం ఎక్కడికి వెళ్లిన సరే తమతో పాటే ఆ ఫోన్ ను కూడా తీసుకెళ్లటం సాధారణమైపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి అర్ధరాత్రి పడుకునే వరకు ఫోన్ పక్కన ఉండాల్సిందే. మనిషి ఫోనుకు ఎంతలా బానిస అయ్యా డంటే చివరకు బాత్‌రూం వెళ్లే సమయంలో కూడా ఫోన్ ను వదలడం లేదు. ఇలా బాత్‌రూం లో ఫోన్ వాడటం చాలా ప్రమాదకరం. మీరు బాత్‌రూంలో ఫోన్ మాట్లాడే, వాడే అలవాటు ఉంటే ఇక నుంచి అయినా మీ అలవాటు మార్చుకునేలా చూసుకోండి. బాత్‌రూం లోకి ఫోన్ తీసుకుపోవడం వల్ల తొందరగా అనారోగ్యం పాలవుతారని ఓ సర్వే తెలిపింది. బాత్‌రూంలో ఉండే బ్యాక్టీరియా నేరుగా కంటే ఫోన్ మీదకు ఎక్కువ వ్యాపిస్తుంది. మీరు చేతులు శుభ్ర పరచుకున్న బాత్‌రూంలోకి తెచ్చుకున్న ఫోన్‌ను ముట్టుకోవడం ద్వారానే బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తుందని తెలిసింది. తద్వారా మీరు చేతులు శుభ్రపరుచుకున్నా ఉపయోగం లేదు. పబ్లిక్ టాయిలెట్లు ఉపయోగిస్తే ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. పలురకాల బ్యాక్టీరియా ఫోను ద్వారా వ్యాప్తి చెంది అనారోగ్యం పాలయ్యే అవకాశం మరింత ఎక్కువగా ఉన్నట్లు సర్వే తెలిపింది.