జియోనీ బ్రాండ్ అంబాసిడర్ గా బాహూబలి

SMTV Desk 2017-06-06 10:57:59  gionee, prabhas, bahubali, brand ambasider

హైదరాబాద్, జూన్ 6 : మెుబైల్ సెల్ ఫోన్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న జియోనీ ఇండియా కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభాస్ ఎంపికయ్యారు. బహూబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన ఆయనను ఆ కంపేనీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. జియోనీ ఇప్పటికే క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, ప్రముఖ కథానాయిక శృతిహాసన్, దుల్కర్ సల్మాన్, దిల్జిత్ దోశాంజ్ వంటి వారితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బహూబలి హీరో ప్రభాస్ తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉంది, తాజా నిర్ణయంతో దేశంలో తమ స్థానం మరింత పదిలమవుతుందని ఆశిస్తున్నాం అని జియోనీ ఇండియా సీఈఓ, ఎండీ అర్వింద్ ఆర్.వోహ్ర తెలిపారు. భారత్ లో కార్యకలాపాలు ప్రారంభించిన ఐదేళ్ళలోనే 1.25 కోట్ల మంది యూజర్లను పొందామని ఆయన వివరించారు.