నోకియా 3.1 ఆగయా..

SMTV Desk 2018-07-19 16:57:48  nokia 3.1 smart phone, hmd global, nokia 3.1, delhi

ఢిల్లీ, జూలై 19 : హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 3.1 ను భారత్‌లో విడుదల చేసింది. ఇప్పటికే వివిధ శ్రేణుల్లో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన హెచ్‌ఎండీ గ్లోబల్‌ తాజాగా మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. గతేడాది మార్కెట్లోకి తెచ్చిన నోకియా 2, 3, 5 ఫోన్లకు అప్‌డేటెడ్‌ వెర్షన్లుగా ఈ ఏడాది మే నెలలో నోకియా 2.1, 3.1, 5.1 ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అందులో ఒకటైన నోకియా 3.1 స్మార్ట్‌ఫోన్‌ను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. నోకియా 3.1 ఫోన్‌ ధర రూ. 10,499గా నిర్ణయించారు. 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను మాత్రమే హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసింది. బ్లూ/కాపర్‌, బ్లాక్‌/క్రోమ్‌, వైట్‌/ఐరన్‌ రంగుల్లో ఇది లభించనుంది. అన్ని మొబైల్‌ షాపులతో పాటు, పేటీఎం మాల్‌ ద్వారా కూడా ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు. భారత్‌లో ఈ ఫోన్‌ విడుదల సందర్భంగా హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రత్యేక రాయితీని ప్రకటించింది. పేటీఎం మాల్‌ యాప్‌ను ఉపయోగించి రిటైల్‌ ఔట్‌లెట్లలో కొనుగోలు చేసేవారికి 10శాతం రాయితీని ఇస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై 5శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. జులై 21 నుంచి ఈ ఫోన్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. నోకియా 3.1 ఫీచర్లు... 5.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 2990 ఎంఏహెచ్ బ్యాటరీ.