మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు..

SMTV Desk 2018-07-07 11:38:33  petrol prices hike, indian oil companies, petrol price, delhi

ఢిల్లీ, జూలై 7 : పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం పెరిగాయి. 36రోజుల తర్వాత పెట్రోల్‌ ధరలు గురువారం నుంచి పెరుగుతూ వస్తున్నాయి. కాగా శనివారం కూడా లీటర్ ‌పెట్రోల్‌పై 13పైసలు, డీజిల్‌పై 10పైసలు పెంచుతున్నట్లు చమురు కంపెనీలయిన వెల్లడించాయి. దీంతో శనివారం నాటికి లీటర్‌ పెట్రోల్‌ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ. 75.98, ముంబయిలో రూ.83.37, కోల్‌కతాలో రూ.78.66, చెన్నైలో రూ.78.85, హైదరాబాద్‌లో రూ.80.35కు చేరుకుంది. లీటర్‌ డీజిల్‌పై 10పైసలు పెరిగి దిల్లీలో రూ.67.76, ముంబయిలో రూ.71.90, కోల్‌కతాలో రూ. 70.31, చెన్నైలో రూ.71.52, అత్యధికంగా హైదరాబాద్‌లో రూ. 73.54కు చేరింది. పెట్రోల్‌ ధరలు చివరిసారిగా జూన్‌ 26న తగ్గాయి. ఆరోజు నుంచి ధరలను జులై 5వరకు యథావిథిగా ఉంచిన చమురు కంపెనీలు తొలిసారి గురువారం పెంచాయి.