మంత్రి అఖిలప్రియ సైకిల్ యాత్ర..

SMTV Desk 2018-04-22 19:11:23   Bhuma Akhila Priya, Cycle Yatra, AP special status

ఆళ్లగడ్డ, ఏప్రిల్ 22: ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ సైకిల్ యాత్ర చేపట్టారు. ఆళ్లగడ్డ మండలం క్రిష్ణాపురం మీదుగా మర్రిపల్లి, రుద్రవరం మండలంలో యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర౦ విభజన హామీలను నెరవేర్చకుంటే ఎంతవరకైనా పోరాడుతామని హెచ్చరించారు. వైసీపీ నేతలు మోదీ వెనుక చేతులు కట్టుకుని నిల్చుంటున్నారని ఎద్దేవాచేశారు.