ప్రారంభం కానున్న “అమ్మఒడి” పనులు…

SMTV Desk 2020-01-04 13:13:08  

రాష్ట్రంలో జరిగిన ఎన్నకల తరువాత, రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ, ఇప్పటికే ఎన్నో సమర్థవంతమైన పథకాలను ప్రవేశ పెట్టాడు. కాగా అందులో కీలకమైన అమ్మ ఒడి పథకానికి సంబందించిన పనులన్నీ కూడా నేటి నుండి ప్రారంబము అవనున్నాయని సమాచారం. కాగా ఈ పథకానికి సంబంధించి, ఇప్పటికే విడుదలైన జాబితాలో పేరులేని తల్లితండ్రులు, వారికి సంబందించిన ధ్రువపత్రాల నకళ్లను ఈనెల 5వ తేదీ సాయంత్రంలోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి అందజేయాలని డీఈవో తెలిపారు.

ఇకపోతే రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్‌ ఆదేశానుసారం నేటి నుంచి అమ్మఒడి వారోత్సవాలను అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో నిర్వహించాలని ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ కార్యక్రమం పై తల్లితండ్రుల కమిటీ సభ్యులకు, విద్యార్థి తల్లితండ్రులకు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈమేరకు ఈ పథకానికి సంబందించిన లబ్ధిదారుల పేర్లను సంబంధిత జాబితాలో ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ పేరు లేని వారు ఎవరైనా ఉంటె సంబంధిత పత్రాలతో మళ్ళీ అధికారులకు అందజేసే సదవకాశాన్ని కల్పించారు.

కాగా ఈమేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు,చక్కటి భోజనం, మరుగుదొడ్ల పరిశుభ్రత, అన్నింటికీ సంబందించిన కట్టుదిట్టమైన జాగ్రత్తలతో సరైన వసతులను ఏర్పాటు చేయాలనీ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు.