నేటి నుంచే ఏపీ ఎంసెట్‌

SMTV Desk 2018-04-22 11:03:49  AP EAMCET online examination

అమరావతి, ఏప్రిల్ 22: ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఎంసెట్‌-2018 ఆన్‌లైన్‌ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఇందుకోసం జిల్లా, నగర పరిధిలో 11 కేంద్రాలను కేటాయించారు. ఇంజనీరింగ్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష 24వ తేదీ వరకు నిర్వహిస్తారు. వ్యవసాయం, వైద్య విద్య పరీక్ష 25న జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 131 పరీక్ష కేంద్రాలు, హైదరాబాద్‌లో ఆరు కేంద్రాల్లో కలిపి మొత్తం 137 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఎంసెట్ ప్రశ్నాపత్రం సెట్‌ కోడ్‌ను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. కాకినాడలో ఎంసెట్ ప్రశ్నాపత్రం సెట్‌ కోడ్ E-9, పాస్‌వర్డ్‌ 99@hyd@99ను విడుదల చేశారు. ఏపీ ఎంసెట్‌కు 2,76,058 మంది విద్యార్ధులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్‌ 1,99,332 మంది.... వ్యవసాయం- వైద్య విద్య పరీక్షకు 76,631.. రెండింటికి కలిపి 1,095 మంది దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 38,127 మంది రాసేందుకు దరఖాస్తు చేశారు. రెండు విడతలుగా ఈ పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు.... మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు.