వాయిదా పడ్డ సభను వీడకండి : చంద్రబాబు

SMTV Desk 2018-04-05 12:53:39  ap cm, chandrababu naidu, tdp mps, parliament,

అమరావతి, ఏప్రిల్ 5 : ప్రత్యేక హోదా కోసం వినూత్న రీతిలో నిరసనలు తెలియజేయాలని.. అనుకోసం సరికొత్త మార్గాలను అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నేడు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా వాయిదా పడితే ఎంపీల౦తా సభలోనే ఉండి తమ నిరసనను కొనసాగించాలని తెలిపారు. నేడు లేదంటే రేపు సభ వాయిదా పడగానే తమ నిరసనను తెలియజేయాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి ఎంపీలను లోక్ సభను విడిచి రావద్దని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.