నటుడు శివాజీపై బీజేపీ నేతలు ఫిర్యాదు

SMTV Desk 2018-03-25 18:28:07  BJP leaders, actor Shivaji, PM Modi

విజయవాడ, మార్చి 25: ఆపరేషన్‌ ద్రవిడ పేరిట ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సినీ నటుడు శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని సూర్యారావు పేట పోలీసులకు ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు. మోదీపై శివాజీ అమానుష వ్యాఖ్యలు చేశారని, మోదీని ఇడియట్ అని దూషించడంతోపాటు.. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలను చేశారని నగర బీజేపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. శివాజీపై కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్టు వారు మీడియాకు తెలిపారు.