మెగా బ్రదర్స్ పై కేశినేని విమర్శలు..

SMTV Desk 2018-03-21 14:18:18  Chiranjeevi, Pawan Kalyan, Keshaneni Nani.

అమరావతి, మార్చి 21 : మెగా అన్నదమ్ములైన మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన సమయంలో అన్న చిరంజీవిని ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్.. ఇప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డురంగా ఉందని అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాడుతుంటే.. చిరంజీవి మౌనంగా ఉన్నాడని.. దీనిపై పవన్ ఎందుకు మాట్లాడారని ప్రశ్నించాడు. చిరంజీవి ప్రజారాజ్యం పోస్ట్ పెయిడ్ పార్టీ అయితే... పవన్ జనసేన ప్రీ పెయిడ్ పార్టీ అని ఎద్దేవా చేశారు. బీజేపీకి పోయేకాలం ముందట పడిందని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి రావాలని సర్వశక్తులతో ప్రయత్నించినా.. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.