పోలవరానికి రూ. 13 వేలకోట్లు..!

SMTV Desk 2018-03-02 16:19:03  polavaram, ap budget 2018-2019, irrigation department, west godavari

పశ్చిమగోదావరి, మార్చి 2 : రాష్ట్ర బడ్జెట్‌(2018-19)లో సాగునీటి రంగానికి భారీగా నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఈ రంగానికి దాదాపు రూ.24 వేల కోట్లు ఇవ్వనున్నట్లు ఇందులో ఒక్క పోలవరం ప్రాజెక్టుకే అత్యధికంగా రూ.13 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. ఈ ఏడాది జలవనరులశాఖకు తొలుత రూ.35 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ ఆర్థికశాఖ విధించిన పరిమితి మేరకు, ప్రాధాన్యాలు రీత్యా అవసరమైన మార్పులు చేసి ప్రతిపాదనలు సమర్పించింది. పోలవరానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా కేంద్రం నుంచి రూ.2800 కోట్ల వరకు రావాల్సి ఉంది.