పవన్ ప్రతిపాదనకు మేము సిద్ధం : జగన్

SMTV Desk 2018-02-19 14:02:24  ys jagan, kandukuru meeting, pawan kalyan, chandrababu naidu

కందుకూరు, ఫిబ్రవరి 19 : రాష్ట్ర హక్కుల సాధన కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న జనసేన అధ్యక్షుడి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనకు వైకాపా సిద్ధమని జగన్ తెలిపారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆదివారం ప్రకాశం జిల్లా కందుకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. “ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తానా అంటే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తందానా అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరి సలహాలైన మేము అంగీకరిస్తాం. అవిశ్వాస తీర్మానానికి మా పార్టీ సిద్ధం. ఒక వేళా తెదేపా నాయకులు ఆ పనిచేస్తే మేము మద్దతు ఇస్తాం “ అని వెల్లడించారు.