టెట్‌ హాల్‌ టిక్కెట్ల జారీలో ఇబ్బందులు..

SMTV Desk 2018-02-15 14:46:12  ap tet, hall tickets, ganta srinivasa rao, teacher eligibility test

అమరావతి, ఫిబ్రవరి 15 : ఏపీ టెట్‌( ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహణ అభ్యర్ధుల పాలిట శాపంగా మారింది. పరీక్ష కేంద్రాల కేటాయింపుల్లో అధికారుల నిర్లక్ష్యం బయట పడింది. ఏ జిల్లా నుంచి అభ్యర్ధి దరఖాస్తు చేస్తే ఆ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలను అధికారులు కేటాయించారు. అంతే కాకుండా హాల్‌ టిక్కెట్ల డౌన్‌ లోడ్‌లో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురు కావడంతో అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి మార్చి మూడో తేదీత వరకు ఆన్‌లైన్‌లో టెట్‌ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయంకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి గంటా శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి గంటా సంబంధిత అధికారులతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. తొలిసారి ఆన్‌లైన్‌లో టెట్‌ పరీక్ష నిర్వహిస్తున్నందున ఎలాంటి ఇబ్బందులుకు తావివ్వకుండా ఉండాలని తొలి నుండి చెబుతున్నా అధికారుల అలసత్వం చూపడం సరైనది కాదని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.