శాంతియుతంగా బంద్ పాటించండి : చంద్రబాబు

SMTV Desk 2018-02-08 12:53:10  ap bandh, cm chandrababu naidu, protest mps, parliament.

అమరావతి, ఫిబ్రవరి 8 : బడ్జెట్ కేటాయింపులపై ఏపీకి అన్యాయ౦ జరిగిందంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అన్ని వర్గాలు ఏపీ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. జనజీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంద్ లో ఎక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా శాంతియుతంగా బంద్ పాటించే వారికి పోలీసులు సహకరించాలని అన్నారు. హింసాత్మక శక్తులు ఈ బంద్‌లో ప్రవేశించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నారని.. బంద్‌ ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు.