తెలంగాణకు విద్యుత్ నిలిపేస్తామంటు ఎపిజేన్ కో హెచ్చరిక

SMTV Desk 2017-05-29 11:18:58  apgenco,tsgenco,electricity,powercut

అమరావతి, మే 28 : తెలంగాణ విద్యుత్ సంస్థలు బకాయిలను చెల్లించని పక్షంలో విద్యుత్ సరఫరాను నిలిపేస్తామని ఆంధ్రపదేశ్ పవర్ జనరేషన్ కార్పోరేషన్ హెచ్చరిక జారీ చేసింది. కౌంట్ డౌన్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే మే 31న మధ్యాహ్నం 12 గంటల నుండి తెలంగాణా సంస్థలకు ఇచ్చే విద్యుత్ సరఫరాను నిలిపేస్తామని హెచ్చరిక జారీ చేసింది. ఇందుకు సంబంధించిన నోటిసును ఏపిజెన్ కో ఎండి , ఏపి ట్రాన్స్ కో సిఎండి కె.విజయానంద్ తెలంగాణా జెన్ కో, తెలంగాణ ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావుకు పంపించారు. ఇందుకు సంబంధించిన ప్రతులను రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యుత్ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, సంబంధిత అధికారులు, కేంద్ర ప్రభుత్వం, బెంగళూరులోని దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటి తదితర సంస్థలకు పంపించారు. తెలంగాణా డిస్కమ్స్ మెుత్తం 3 వేల 138 కోట్ల బకాయిలు ఏపి జెన్ కో కు చెల్లించాల్సి ఉంది. 2016 ఏప్రిల్ నాటికి సింగరేణికి ఏపి జెన్ కో 1,437 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండడంతో బొగ్గు సరఫరాను క్రమబద్దీకరించాలని అందులో వెల్లడించారు. అయితే బకాయిల నేపథ్యంలో ఆ మెుత్తాన్ని సెటిల్ చేసేందుకు తెలంగాణా రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటి అంగీకరించినా అందుకు సింగరేణి సుముఖంగా లేకపోవడంతో తాము సమస్య ఎదుర్కొంటున్నామని, ఆ దరిమిలా వెంటనే బకాయిలు చెల్లించాలని ఆ నోటిసులో నివేదించారు.