105భాషల్లో పాడి ఔరా అనిపించిన 14ఏళ్ల బాలుడు!

SMTV Desk 2018-01-07 12:41:59  rohit, singer, 105 languages, 14 years, vijayawada updates

విజయవాడ, జనవరి 07: "కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు..మహాపురుషులవుతారు"అనేది నానుడి. సరిగ్గా దానిని నిజం చేస్తూ 14ఏళ్ల బాలుడు తన అద్భుత గాత్రంతో శ్రోతలను అబ్బురపరిచాడు. పాడడమే కష్టమనుకుంటే గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించేందుకు ఏకంగా 105 భాషల్లో గీతాలను ఆలపించి అబ్బుర పర్చాడు కృష్ణా జిల్లా కానూరుకి చెందిన రోహిత్‌. విజయవాడలో కళామంజిరి సాంస్కృతిక సేవా సంస్థ కొచ్చర్లకోట సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 9 వరకు 105 భాషల్లో రోహిత్ పాటలు పాడారు. ఈ పాటల్లో 36 దేశీయ భాషలు, 68 విదేశీ భాషలు ఉన్నాయి. తొలుత తెలుగు భాషతో ప్రారంభించి మంగోలియా, స్పానిష్‌ వంటి పాటలను రోహిత్ పాడారు. గతంలో ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన పిల్లల కార్యక్రమంలో వ్యాఖ్యాతగా, చిన్నపిల్లల దానవీరసూర కర్ణ సినిమాలో శకునిగా చేశాడు. రోహిత్‌కు చిన్నప్పటి నుంచి వివిధ భాషలపై ఉన్న మక్కువతో ఏడాది నుంచి నిత్యం సామాజిక మాధ్యమాల్లో అన్వేషిస్తూ వివిధ భాషల్లో పాటలను నేర్చుకున్నాడు. ఈ సందర్భంగా రోహత్‌ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి రోహిత్‌కు ఉన్న అభిరుచి మేరకే ప్రోత్సహిస్తున్నామన్నారు.