వేధింపులు తాళలేక నిండు కుటుంబం బలి...

SMTV Desk 2018-01-05 12:17:22  suicide, crime, visakhapatnam

విశాఖపట్టణం, జనవరి 5: నగరంలో ఓ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. తమ ఇద్దరు పిల్లలు సహా, దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ఆరిలోవలోని ముస్తఫా కాలనీలో సౌమ్య, రాజేష్ అనే దంపతులు ఉండేవారు. వారికీ ఇద్దరు పిల్లలు విష్ణుతేజ, జాహ్నవీ. భార్య భర్తలు ఇద్దరు వారి పిల్లల్ని చంపి, వారు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సౌమ్య ఓ సూసైడ్ నోట్ రాసింది. ఈ నోట్ లో ఆమె.. చాలామంది కామాంధులు తన చుట్టూ తిరిగారని, ఇక వారి వేధింపులు తాళలేక చనిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. ఇద్దరు పిల్లలనూ చంపి ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉన్నా, తన తరువాత బిడ్డలకు దిక్కుండదనే వారిని కూడా తీసుకెళుతున్నానని తెలిపింది. అంతేకాదు తన సన్నిహితులలోని ప్రియ, పవిత్రలకు జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించింది. ఈ నోట్ ను విశ్లేషిస్తున్న పోలీసులు అనేక కోణాలలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంతకి రాజేష్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.