జన్మభూమి - నా ఊరులో పాల్గొన్న మంత్రి నారాలోకేశ్

SMTV Desk 2018-01-03 14:58:35  Janmabhumi naa uru, krishna dist poranki, minister naralokesh

కృష్ణా, జనవరి 03 : ఈ నెల 2 నుంచి చేపట్టిన జన్మభూమి - నా ఊరు కార్యక్రమంలో భాగంగా నేడు కృష్ణా జిల్లా పోరంకిలో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సృష్టించిన బాహుబలి చిత్రానికి సహాయంగా నిలిచినా ఎద్దులు పోరంకిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే, కృష్ణా జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి నారాలోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, బాహుబలి ఎద్దులు, ఒంగోలు జాతి గిత్తలు, పుంగనూరు పశువులు అదే విధంగా టర్కీకోడి, ఒంగోలు గొర్రెలతో పాటు అనేకమైన పశుసంపదలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహారాష్ట్ర బ్రీడ్‌కు చెందిన ఈ గిత్తలను దాసరి హరినీడు అనే రైతు వాటిని సంరక్షిస్తున్నారు.