నిషేధిత ఔషధాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

SMTV Desk 2017-12-17 15:31:23  Prohibited License, The arrest of the gang selling drugs

రాజమహేంద్రవరం, డిసెంబర్ 17 : లైసెన్సు లేకుండా నిషేధిత ఔషధాలు విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3 లక్షల విలువైన ఔషధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నేడు ఉదయం, రావులపాలెంకు చెందిన వీరవెంకట సుబ్బారావు, గుంటూరుకు జిల్లాకు చెందిన రమేశ్, రాజమహేంద్రవరానికి చెందిన కృష్ణచైతన్య సహా మరో ఇద్దరు కలిసి మత్తు ఇంజెక్షన్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని పక్క సమాచారంతో దాడులు చేసి, భారీగా ఔషధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆళ్లగడ్డకు చెందిన శేఖర్ అనే వ్యక్తి వీటిని సరఫరా చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. ప్రస్తుతానికి అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.