ఈ నెల 14న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం

SMTV Desk 2017-12-13 17:58:13  kamineni srinivas, Vijayawada, fatima medical college student

అమరావతి, డిసెంబర్ 13 : ఈ నెల 14న విజయవాడలోని ఫాతిమా కళాశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులతో భేటీ నిర్వహిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ ఆధికారులు, ఎంసీఐతో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి చర్చిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 108పై హైకోర్టులో జీవీకేకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు కేసునే అడ్మిట్ చేసుకోలేదని ఆయన వెల్లడించారు.