స్వార్ధ రాజకీయాల్లో మార్పు రావాలి :చింతా మోహన్

SMTV Desk 2017-12-12 12:55:55  Former MP Chinta Mohan, cm chandrababu naidu, vijayawada krishna dist

విజయవాడ, డిసెంబర్ 12 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు తలెత్తుతున్న తరుణంలో సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వాటాల పంపిణీలో తేడాలరావడమే పోలవరంపై రాద్ధాంతం జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేషరుతుగా రాజీనామా చేయాలని అన్నారు. 2శాతం మాత్రమే ఉన్న జగన్‌ సామాజిక వర్గానికి అధికారం అవసరంలేదన్నారు. ఏపీ స్వార్థ రాజకీయాల విధానాల్లో మార్పురావాలని చింతా మోహన్ అన్నారు. అలాగే కాపులకు 5శాతం రిజర్వేషన్‌ న్యాయస్థానంలో నిలబడదని ఆయన అన్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ 100-120 స్థానాలు గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు.