ప్రకాశంలో పవన్ పర్యటన

SMTV Desk 2017-12-09 12:59:40  prakasam, pawan kalyan, janasena, krishna river victim families

ఒంగోలు, డిసెంబర్ 09 : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో పర్యటిస్తున్నారు. ఇటీవల జరిగిన కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఒంగోలులోని ఏ–1 కన్వెన్షన్‌ హాలులో బాధిత కుటుంబాలు ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..."జరిగిన ఘటన చాలా విషాదకరమైనది. ఏ కుటుంబాన్ని కదిలించిన కన్నీళ్లే వస్తున్నాయి. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేము. బాధిత కుటుంబాలలో ఆత్మ స్థైర్యం సడలిపోకుండా చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. భవిష్యతులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి." అని అన్నారు. కాగా ఈ పర్యటనపై ప్రతిపక్ష పార్టీ వైసీపీ నాయకులు స్పందిస్తూ, బాధితుల ఇళ్లకు వెళ్లడానికి బదులుగా వారందరినీ ఓ చోటుకు పిలిపించి, పరామర్శించేందుకు ఏర్పాటు చేయడ౦ ఏంటని విమర్శిస్తున్నారు.