ప్రజలకు ట్రంప్ హెచ్చరికలు

SMTV Desk 2017-12-09 12:31:13  america, pak, Terrorist The US State Department

వాషింగ్టన్, డిసెంబర్ 09 ‌: పాక్‌లో స్థానిక, విదేశీ ఉగ్రవాద సంస్థల నుంచి ప్రజలకు ప్రమాదం ఉందని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. ఆ దేశ ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయని, ప్రభుత్వ, మానవతావాదులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేయడం అక్కడ సాధారణం అయిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. గతంలో కూడా అమెరికా దౌత్యవేత్తలు, అధికారులపై దాడులు జరిగిన సందర్భాలున్నాయని, భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆ హెచ్చరికల్లో పేర్కొన్నారు. పాక్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడులను కూడా ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రస్తావించింది. ప్రజలు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఉగ్రవాదులకు పాక్‌ దేశం స్వర్గధామంగా మారుతోందని, దీన్ని అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని అమెరికా గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్న పాక్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆ దేశానికి అనవసర ప్రయాణాలు చేయవద్దని అగ్రరాజ్యం అమెరికా తమ దేశ పౌరులకు సూచించారు.