విశాఖ నౌకాదళం ఉత్సవాల్లో రాష్ట్రపతి

SMTV Desk 2017-12-08 12:45:22  President of ramnath kovindh the Visakhapatnam Navy ceremonies

విశాఖపట్నం, డిసెంబర్ 08 : నౌకాదళంలోకి జలాంతర్గామి ప్రవేశించి యాభై ఏళ్లు పూర్తైన సందర్భంగా విశాఖలో ఐఎన్ఐ సర్కార్ మైదానంలో జరుగుతున్న ప్రజంటేషన్ ఆఫ్‌ కలర్స్‌ ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హజరయ్యారు. అలాగే, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ మాట్లాడుతూ...భారత ఆర్థిక వ్యవస్థ నౌకాయాన రంగంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. 90 శాతం వర్తకమంతా నౌకాయానం ద్వారానే జరుగుతోందని అన్నారు. జలాంతర్గాముల విభాగం నౌకాదళంలో అత్యంత శక్తిమంతమైన విభాగమని తెలిపారు. నౌకాదళంలో 25 సబ్‌మెరైన్లు ఉన్నాయని, శత్రుభయంకరంగా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతున్నట్లు చెప్పారు. భారతీయ నౌకాదళం జలాంతర్గామి విభాగాన్ని 1967 డిసెంబర్ 8న ప్రారంభించారు.