ఆంధ్రా తీరం వైపుగా వాయుగుండం...

SMTV Desk 2017-12-06 17:22:07  whether report, vishakapatnam

విశాఖపట్నం, డిసెంబర్ 06 : ఆంధ్రా తీరం దిశగా వాయుగుండం రానుంది. దీంతో కోస్తా తీరం అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మత్య్సకారులు వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో వాయుగుండం మరింతగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో, మచిలీపట్నానికి 1160 కి.మీ దూరంలో దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది.