7,8 తేదీల్లో ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి...

SMTV Desk 2017-12-05 17:59:04  president, ramnadh kovind, andhrapradesh, visit, schedule

అమరావతి, డిసెంబర్ 05: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 7,8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక పర్యటన షెడ్యూల్ ఎపి అధికారులకు అందింది. ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్రపతి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఎయిర్ క్రాప్ట్ మ్యూజియంను ప్రారంభించనున్నారు. అనంతరం ఏయూలో ఈ-క్లాస్ రూం కాంప్లెక్స్ భవనానికి, ఇంక్యుబేషన్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. 8వ తేదీన ఉదయం 8 గంటలకు ఐఎన్ఎస్ పరేడ్ గ్రౌండ్‌లో కలర్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొని, ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి కోవింద్ తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.