సీఎం చంద్రబాబు వైపు బీజేపీ :ఉండవల్లి అరుణ్

SMTV Desk 2017-12-04 17:33:44  AP CM Chandrababu naidu, modi, udavalli arun

అమరావతి, డిసెంబర్ 04 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గత ఏడాది నుంచి భారత ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు చేశారు. ఈ విషయంలో చంద్రబాబు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారని, సీఎం చంద్రబాబుకు మోదీతో వాదించేంత ధైర్యం లేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు లేకుంటే ఏపీ రాష్ట్రమే లేదని అభిప్రాయపడ్డ ఆయన, ఈ ప్రాజెక్టుకు ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందన్న విషయాన్ని కనీసం ఊహించలేకపోతున్నానని అన్నారు. చంద్రబాబు ఇలా ఎందుకు తలొగ్గి బలహీనుడు అయిపోయాడో అసలైన కారణం తెలియడం లేదని చెప్పారు. ఇంతటి పరిస్థితి రావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. బీజేపీతో జగన్ కలిసి వెళితే మటాష్ అయిపోతారని, ఆయనకు ఉన్న మైనారిటీ, ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకు దూరమవుతుందని హెచ్చరించారు. 2014లో తొలుత జగన్ ను సంప్రదించి, అక్కడ పొత్తు కుదరకనే, చంద్రబాబు వైపు బీజేపీ వచ్చిందన్నారు.