విద్యార్ధులపై అమానవీయంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు

SMTV Desk 2017-12-03 15:18:43  An educated teacher, Punishment student, kakinada

కాకినాడ, డిసెంబర్ 03 : గురుబ్రహ్మ..గురువిష్ణుహు..గుర్వుదేవో మహేశ్వరః అంటూ విద్యార్ధులు ప్రతి దినం పాఠశాలలో గురువుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. తల్లిదండ్రుల తరువాత అంతటి ఆధారణ ఒక్క ఉపాధ్యాయుడికే ఉంటుంది. అలాంటి ఉపాధ్యాయుడే తెలుగు పద్యం చెప్పలేదని విద్యార్థులపట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం భీమవరం ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. తెలుగు పద్యం చెప్పలేదని ఓ ఉపాధ్యాయుడు 24మంది విద్యార్థులను చెప్పుతో కొట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఏటీడబ్ల్యూవోను విచారణ నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా సదరు ఉపాధ్యాయుడిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని నోటిసులు జారీ చేసింది. విద్యార్ధులకు ఇలాంటి సంఘటన ఎదురవ్వడంతో బాధను దిగమింగుకున్నారు.