బిసిలకు అన్యాయం జరుగకుండా చూస్తాం :మంత్రి నారాయణ

SMTV Desk 2017-12-02 18:04:41  Justice Manjunatha CommitteeMinister Narayana

అమరావతి, డిసెంబర్ 02 : నేడు జరిగిన కాపు రిజర్వేషన్ల ఆమోదంపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మీడియాతో ముచ్చటించారు. నలుగురు సభ్యుల్లో ముగ్గురు మాత్రమే ఇప్పటి వరకు రిజర్వేషన్లపై నివేదిక ఇచ్చారని ఆయన అన్నారు. దీంతో మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో ముందుకు వెళ్లామని మంత్రి తెలిపారు. 50 శాతం రిజర్వేషన్లు దాటితే 9వ షెడ్యూల్‌లో మరో 5 శాతానికి చేర్చాలి. అందుకే తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, మంత్రి వివరించారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రావనే తాము అనుకుంటున్నామని, బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని నారాయణ పేర్కొన్నారు. కాగా, కాపు కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ మంజునాథ రిజర్వేషన్ల విషయంలో మొదటి నుంచి భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.