సముద్ర స్నానానికి వెళ్ళి గల్లంతైన మహిళలు..

SMTV Desk 2017-11-30 14:25:54  tragic event on Nellore beach, 4 women missing issue,

నెల్లూరు, నవంబర్ 30 : నెల్లూరు జిల్లా తూపిలి పాలెం బీచ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్ళిన నలుగురు మహిళల్లో ఇద్దరు మహిళలు మృత్యువాత పడగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. కాగా మృతి చెందిన రెండు మృతదేహాలను ఒడ్డుకు చేర్చి, గల్లంతైన వారి కోసం ఈతగాళ్ళు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ తూపిలి పాలెం బీచ్ వద్ద అలల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.