జగ్గయ్యపేటలో ఉద్రిక్తత వాతావరణం..

SMTV Desk 2017-11-19 17:34:30  jaggampeta, ycp members controversy, municipal elections.

కృష్ణా, నవంబర్ 19 : జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ గా ఇటీవల ఎన్నికైన ఇంటూరి చిన్నాకు వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నంబూరి రవికి మధ్య వివాదం తలెత్తింది. అయితే తనకు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో మద్దతుగా నిలవలేదని ఆరోపిస్తూ చిన్నా, రవితో గొడవకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తనను చిన్నా కొట్టడం వల్ల గాయాలపాలయ్యానని రవి ఆసుపత్రిలో చేరాడు.